జనం న్యూస్ మే 10 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ : ఆపరేషన్ సింధూర్" పేరుతో త్రివిధ దళాలు కలిసి తీవ్రవాదులపై విరుచుకుపడి మట్టుపెట్టిన సంగతి మన అందరికీ తెలిసిందే ఇటువంటి సమయంలో దేశ ప్రజల రక్షణం కోసం మన సైన్యం రేయింబవళ్లు కాపలకాస్తూ, శత్రుసైన్యం దాడులనుంచి మనల్ని కాపాడుతున్నారు. ఇలాంటి సమయంలో ప్రజలు తీర్థ విహారయాత్రలకు వెళ్తే, మన రక్షణ సైన్యానికి మరింత భారం అవుతుందని అనకాపల్లి నియోజకవర్గం నుంచి చాలామంది ముందస్తుగా విహారయాత్రలకు ఏర్పాట్లు చేసుకున్నారని మాకు సమాచారం తెలిసినందున, ఈ సమయంలో అది అంత సురక్షితం కాదని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర కార్పొరేషన్ చైర్మన్ మల్ల సురేంద్ర ఒక ప్రకటనలో తెలిపారు.//