( జనం న్యూస్ మే 10 చంటి) తేదీ:09/05/2025 నాడు మధ్యాహ్నం 1. 30 గంటలకు సూరారం గ్రామానికి చెందిన చామంతి మహేష్ తండ్రి సత్తయ్య, వయస్సు 30 సం!!లు, ఎస్సీ మాల, ఎలక్ట్రిషన్ అనున్నతడు తన కుటుంబంతో సహా తన బంధువైన అల్వాల గ్రామానికి చెందిన బాబురావు ఇంటికి వచ్చి ఫంక్షన్ లో మద్యం సేవించి న తర్వాత తన బైక్ పై బయటకు వెళ్లి తిరిగి రాకపోవడంతో అంతా వెతికిన ఎక్కడా కనిపించక పోవడంతో తేదీ: 10/05/2025 నాడు ఉదయం 06.00 గంటలకు అలవాల వాగు లో శవం తేలినదని తెలవగా వెళ్లి చూడగా మృతుడు చామంతి మహేష్ స్థానానికి వెళ్లి ప్రమాదవశాత్తు జారీ వాగు నీటిలో పడి మునిగి ఊపిరాడక చనిపోయినాడు అని మృతుని భార్య చామంతి కనక లక్ష్మి ఫిర్యాదు మేరకు మిడిదొడ్డి పోలీసు వారు కేసు నమోదు చేసి పరిశోధన ప్రారంభించినారు.