జనం న్యూస్ మే 10 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ : భారత ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ సింధూర విజయవంతం కావాలని భారతీయ సైనికులు,,దేశ సరిహద్దు గ్రామాల ప్రజలు క్షేమంగా ఉండాలని.. పార్టీ అధిష్టానం పిలుపుమేరకు. ఈరోజు కాట్రేనికోన మండల భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు మట్ట శివకుమార్ ఆధ్వర్యంలో.. కుండలేశ్వరం గ్రామం లో శ్రీ పార్వతీ కుండలేశ్వర స్వామి ఆలయంలో పూజలు నిర్వహించారు.. ఆలయ అర్చకులు కాలకూరు కామేశ్వరి శర్మ.. దేశం కోసం పోరాడుతున్న సైనికులకు.. అమ్మవారు పరమేశ్వరు ఆశీస్సులు తోడైయుండి శక్తి సామర్థ్యాలను పెంపొందించాలని.. మన జవాన్లకు ప్రాణనష్టం కలగకుండా.. శత్రు దేశంపై భారత్ విజయం సాధించాలని.. ఆయన పూజలు నిర్వహించారు.. ఈ కార్యక్రమంలో బిజెపి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ట్రెజరర్ గ్రంధి నానాజీ మరియు అసెంబ్లీ కన్వీనర్ గొల్ల కోటి వెంకటరెడ్డి స ముఖ్యఅతిథిగా విచ్చేసి ప్రార్థించారు..బిజెపి నాయకులు.. మండల పూర్వ అధ్యక్షులు మట్ట సూరిబాబు గ్రంధి నాని బాబు.. గొల్ల కోటి వెంకటేశ్వరరావు.. . మరియు స్థానిక ప్రజలు పాల్గొని పూజలు నిర్వహించారు.. అనంతరం భారత్ మాతాకీ జై అని నినాదాలు చేశారు