జనం న్యూస్ 11 మే, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక
గత రాత్రి నుంచి విశాఖపట్నం నగరంలో పలు ప్రాంతాలలో సుమారు 40 సంవత్సరాలు వయసు ఉండే ఒక మగ వ్యక్తి పెద్ద గడ్డంతో సూట్ ధరించి అనుమానస్పదంగా ఫోటోలు తీస్తూ సంచరించడం కొంతమంది ప్రజలు గమనించినారు ఆ విషయాన్ని పోలీసు వారికి తెలియజేశారు మరియు సోషల్ మీడియాలో కూడా అతనిపై పోస్టింగులు కూడా పెట్టి ట్రోల్ చేయడం జరిగింది.ఆ వ్యక్తిని చూసిన వాళ్ళందరూ ఆయన డ్రెస్సు, గడ్డం ఆధారంగా ఆయన బయట నుంచి వచ్చిన వ్యక్తి అని, ఫోటోలు కొన్ని ఇంపార్టెంట్ ప్లేసులవి తీస్తున్నట్లు చూసి ఆయన ఒక ప్రమాదకరమైన మనిషి అని భావించి సోషల్ మీడియాలో అతని ఫోటోతో చాలా ట్రోల్ చేసి ఉన్నారు సదరు విషయం తెలుసుకున్న నగర పోలీసు కమీషనర్ డా.శంఖబ్రత బాగ్చి, ఐ.పి.ఎస్., గారు , వారి సిబ్బంది అందరికీ సదరు వ్యక్తిని పట్టుకొని విచారణ చేయమని ఆదేశించినారు, ఆ క్రమంలో అతని గురించి సిటీలోని అన్ని పోలీస్ స్టేషన్ ప్రాంతాలలో చెక్ చేయడం జరిగింది. చాలా వాహనాల కూడా తనిఖీ చేస్తున్న క్రమంలో సదరు వ్యక్తి పీఎం పాలెం కార్ షెడ్ జంక్షన్ వద్ద బస్సులో వెళ్తున్నట్లు తెలుసుకున్న పీఎం పాలెం సిఐ గారు వారి సిబ్బందితో ఆ బస్సుని చెక్ చేసి అతన్ని పట్టుకోవడం జరిగింది.అతని పోలీస్ స్టేషన్ తీసుకుని వచ్చి విచారణ చేయగా సదరు వ్యక్తి బొబ్బిలి మండలం , విజయనగరం జిల్లాకు చెందిన వ్యక్తి అని తెలిసినది సదర వ్యక్తి ఆర్మీలో చేస్తూ గత 2023 వ సంవత్సరం డిసెంబర్లో రిటైర్ అయ్యి వచ్చినట్లు తెలిసింది అతని తల్లి తండ్రి అన్నదమ్ములు కూడా ఉన్నట్లు ఎంక్వయిరీలో తెలుసుకోవడం జరిగినది. వాళ్ళ కుటుంబ సభ్యులతో కూడా మాట్లాడటం జరిగింది సదరు వ్యక్తి ఆర్మీ నుంచి 2023 సంవత్సరంలో రిటైర్ అయిన తర్వాత అతనికి మానసికంగా కొంత కాలంగా అనారోగ్యంగా ఉన్నట్లు, తాను ఒక్కడే అలా తిరుగుతూ ఉంటాడని ఆయన మానసిక స్థితి వలన అలా ప్రవర్తిస్తున్నాడని వాళ్ళ కుటుంబ సభ్యులు తెలుపడం జరిగింది.సదరు వ్యక్తిని ఎంక్వయిరీ చేసిన తరువాత ఆయనపై ఏ విధమైన చెడు నడతకు సంబంధించిన ఆధారాలు లేనందున అతనిని అతని బంధువులకు ఇచ్చి పంపించడం జరిగింది.