జనం న్యూస్ 11 మే, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక
విజయనగరం రైల్వే ఫ్లాట్ ఫామ్‌పై శనివారం నిర్వహించిన తనిఖీల్లో 50,000 విలువచేసే 10 కేజీల గంజాయి పట్టుబడినట్లు రైల్వే GRP ఎస్ఐ పి.బాలాజీ రావు తెలిపారు. విజయవాడ, విశాఖపట్నం రైల్వే పోలీస్ ఉన్నత అధికారుల ఆదేశాల మేరకు శనివారం తనిఖీలు నిర్వహించామన్నారు. ఒడిశా రాష్ట్రం రాయగడకు చెందిన పింటూనాగ్ (22) కేరళ రాష్ట్రం కొల్లంనకు గంజాయి తరలిస్తుండగా పట్టుకుని కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్లు చెప్పారు.