జనం న్యూస్ :12 మే సోమవారం:సిద్దిపేట నియోజికవర్గ ఇన్చార్జి వై.రమేష్:
శ్రీకృష్ణ యాదవ ఫంక్షన్ హాల్ సిద్దిపేటలో యాదవ ఉద్యోగుల సమావేశం జరిగింది. ఇది సమావేశంలో అఖిల భారత యాదవ మహాసభ జిల్లా అధ్యక్షులు మామిండ్ల ఐలయ్య యాదవ్ మాట్లాడుతూ ఉన్నత స్థితిలో ఉన్న యాదవులు కుల బంధువులకు సేవ చేయాలన్నారు. ఈ సందర్భంగా యాదవ ఉద్యోగుల నూతన కార్యవర్గం ఏర్పడింది. జిల్లా అధ్యక్షులుగా బైరి అనిల్ కుమార్ యాదవ్, ప్రధాన కార్యదర్శిగా సందేబోయిన రాజు యాదవ్, ఆర్థిక కార్యదర్శిగా ఉండ్రాళ్ళ రాజేశం యాదవ్, ఉపాధ్యక్షులుగా బత్తుల రాములు యాదవ్, కార్యవర్గ సభ్యులుగా బొద్దుల బాల్ నర్సయ్య యాదవ్, తలారి చంద్రశేఖర్ యాదవ్, దాసరి రాజు యాదవ్, ఆవుల రాజు యాదవ్, కొరివి మల్లేశం యాదవ్, పోలీస్ లక్ష్మణ్ యాదవ్, సలహమండలి సభ్యులుగా చింతల బాల్ నర్సయ్య యాదవ్, జక్కుల రాజేశం యాదవ్, నూనె రాజయ్య యాదవ్ లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.