- ప్రతిష్టాత్మకంగా ఈ నెల 26 నుండి నాలుగు ప్రభుత్వ పథకాలు.
- కొన్నేళ్ల తర్వాత రేషన్ కార్డుల అమలుకు శ్రీకారం.
- రేపటి గ్రామ సభలు,పట్టణాల్లో వార్డు సభలను సద్వినియోగం చేసుకోండి..
- ప్రజా ప్రభుత్వంలో దళారి వ్యవస్థకు అవకాశం లేదు..
- పథకాల అమలు పేరిట డబ్బులు డిమాండ్ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటాము..
- మరల దరఖాస్తుల స్వీకరణ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి..
జనం న్యూస్ // జనవరి 20 // జమ్మికుంట// కుమార్ యాదవ్..ఈనెల 26న ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేసే నాలుగు ప్రభుత్వ పథకాలను హుజురాబాద్ నియోజకవర్గంలోని లభ్దిదారులు సద్వినియోగపరుచుకోవాలని,ఆలాగే ప్రభుత్వ పథకాలకు సంబంధించి దళారి వ్యవస్థ ఉండబోదని,ప్రజా ప్రభుత్వంలో పథకాల అమలుపేరిట ఎవరైనా డబ్బులు డిమాండ్ చేస్తే వారిపట్ల కఠినమైన చర్యలు తీసుకుంటామని హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ వొడితల ప్రణవ్ ఒక ప్రకటనలో తెలిపారు.కొన్నేలుగా జారికాని కొత్త రేషన్ కార్డులు ఈనెల 26 నుండి జారీ అవుతాయని ఈ నాలుగు ప్రభుత్వ పథకాలకు సంబంధించి మంగళవారం రోజున ప్రతి గ్రామంలో గ్రామ సభలు,హుజురాబాద్,జమ్మికుంట మున్సిపల్ పరిధిలో వార్డు సభలు అధికారుల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నామని తెలిపారు.ఇదివరకు పేర్లు నమోదు కానీ వారు అధికారులు గ్రామానికి,వార్డుకు వచ్చినప్పుడు వారికి సంబంధించిన పత్రాలను లబ్ధిదారులు అందించి మరల నమోదు చేసుకోవాలని సూచించారు.నాలుగు ప్రభుత్వ పథకాల్లో భాగంగా రేషన్ కార్డులు,ఇందిరమ్మ ఇళ్లు,ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం,రైతు భరోసా పథకాలను అమలు చేస్తున్నామని తెలిపారు.అలాగే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని లబ్ధిదారులకు సహాయం చేయాలని కోరారు.