జనం న్యూస్ జనవరి 20(నడిగూడెం)మండల కేంద్రంలో గల విద్యా వనరుల కేంద్రం నందు మండలంలోని ప్రాథమిక, ప్రాథమికోన్నత,ఉన్నత పాఠశాల,ఆదర్శ పాఠశాల, కస్తూరిబా గాంధీ పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు నిజాం పిజియోథెరపీ ఇనిస్ట్యూట్ ఆఫ్ హైదరాబాద్ డాక్టర్లచే పిజియోథెరపీపై సోమవారం అవగాహన సదస్సు నిర్వహించారు. సదస్సులో ఎంఈఓ ఉపేందర్ రావు, ప్రధానోపాధ్యాయులు, ఫిజియోథెరపీ ఇనిస్టిట్యూట్ సిబ్బంది, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.