జనం న్యూస్ జనవరి 20( నడిగూడెం)మండల పరిధిలోని సిరిపురం గ్రామంలో వేంచేసి ఉన్న శాలివాహన శకం, విక్రమ నామ సంవత్సరం, క్రీస్తు శకం 1802 లో, ప్రతిష్టించిన శ్రీదేవి భూదేవి సమేత స్వయంభు శ్రీ రంగనాయక స్వామి దేవాలయ నిర్మాణ పనులు, స్థానిక ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి, ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ కుమార్ రెడ్డి, దాతల సహకారంతో ముమ్మరంగా పనులు సాగుతున్నాయనీ, చైర్మన్ తాళ్లూరి రమేష్, పాలకవర్గ సభ్యులు సురగాని వెంకన్న, ఆత్మకూరి శ్రీనివాస్, పసుపులేటి రామాయమ్మ యాదగిరి, రాయపూడి వెంకన్న లు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.రాజగోపురం, కళ్యాణ మండపం ,పడమర పక్క పహరి గోడ, ధ్వజస్తంభ పునర్నిర్మాణం,కాంపౌండ్ బండలు, నిర్మాణానికి కు దాతల సహకారం అందించి నిర్మాణం పూర్తి చేయాలని ఆలయ కమిటీ సభ్యులు మాజీ చైర్మన్ పసుపులేటి యాదగిరి, గ్రామస్తులు, తదితరులు విజ్ఞప్తి చేశారు.