జనం న్యూస్ 21 జనవరివిజయనగరం టౌన్ రిపోర్టర్గోపికృష్ణ పట్నాయక్విజయనగరం జె.ఎన్.టి.యు క్యాంపస్లో ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ పిడిఎఫ్ ఎమ్మెల్సీ అభ్యర్థి కె.విజయగౌరి సోమవారం ప్రచారం చేశారు. ఎన్నో ఏళ్ల నుంచి ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యలు, విద్యారంగంలో ఉన్న సమస్యలు పరిష్కారానికి పోరాటం చేశానని, రానున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో తనకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని అధ్యాపకులను కోరారు. విజయగౌరికి మద్దతుగా ఉత్తరాంధ్ర అభివృద్ధి వేదిక నేత అజశర్మ ప్రచారంలో పాల్గొన్నారు.