విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ ఐపిఎస్.,
జనం న్యూస్ 16 మే, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక
జిల్లాలో నేరాలను నియంత్రించుటకు “ఈ-బీట్స్” విధానంను అమలు చేసి, పోలీసు గస్తీని మరింత పటిష్టం
చేస్తున్నట్లుగా జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ మే 15న తెలిపారు.ఈ-బీట్స్ విధానంపై పోలీసు అధికారులు, సిబ్బందికి అవగాహన కల్పించి, ఈ-బీట్స్ అమలు చేయుటలో వారి సందేహాలను నివృత్తి చేందుకు జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ జూమ్ మీటింగు నిర్వహించారు.ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ మాట్లాడుతూ - పోలీసు గస్తీలో సాంకేతిక పరిజ్ఞానంను వినియోగిస్తూ ఈ-బీట్స్ విధానంతో పోలీసు గస్తీని మరింత పటిష్టం చేసి, పోలీసు పహారాను సమర్ధవంతంగా,పారదర్శకంగా అమలు చేయనున్నామన్నారు. ఈ విధానంతో పోలీసు గస్తీని ట్రాక్ చేయడం, వారి నిర్వహించే పహారా విధులను విశ్లేషించడం, పర్యవేక్షించడం లైవ్లోనే చేయనున్నామన్నారు. ఈ బీట్స్ విధానంలో పోలీసు స్టేషనులో పని చేసే పోలీసు అధికారులు, సిబ్బందికి ముందుగా యూజర్ ఐడిలు, పాస్వర్డ్స్ క్రియేట్ చేయడం జరుగుతుందన్నారు. పోలీసు స్టేషను పరిధిలోని వివిధ ప్రాంతాలను బీట్లుగా క్రియేట్ చేసి, వాటిని రాత్రి లేదా పగలు వహారాకు వెళ్ళే
పోలీసుల యూజర్ ఐడిలకు అనునంధానం చేస్తామన్నారు. ఈ బీటు క్రియేట్ చేసే సమయంలో బీటు సిబ్బంది నిర్వహించాల్సిన విధులు, ఆయా ప్రాంతాల్లో ప్రత్యేకంగా దృష్టి పెట్టాల్సిన ఎ.టి.ఎం. కేంద్రాలు, బస్టాండులు, రైల్వే స్టేషనులు, బ్యాంకులు, లాక్డ్ హౌస్లు, హిస్టరీ షీట్లు కలిగిన వ్యక్తుల వివరాలు, షాపింగ్ మాల్స్ వంటి వాటి వివరాలు, ఏ ప్రాంతంలో ఎంత సమయం పహారా కాయాలి, గస్తీ తిరగాలన్న విషయాలు నమోదు చేయబడతాయన్నారు. ప్రతీ రోజూ పోలీసు స్టేషను అవసరాలు, ప్రాధాన్యతలను అనుసరించి, ఈ బీటును మార్పులు చేసుకోవచ్చునన్నారు. పోలీసులు గస్తీ నిర్వహించే సమయంలో ఏదైనా సంఘటనలు జరిగినట్లయితే వాటి ఫోటోలను ఈ-బీట్ అలర్ట్స్ అనే అప్షన్తో సంబంధిత అధికారులు ఎక్కడ నుండైనా పరిశీలించ వచ్చునన్నారు. ఈ-బీట్స్ అమలుతో పోలీసు సిబ్బంది నిర్వహించే గస్తీ విధులను లైవ్లోను, గస్తీ పూర్తయిన తరువాత వారు ఎక్కడ, ఎంత సమయం, ఏవిధంగా విధులు నిర్వహించినది నివేదికతో సంబందిత ఎస్.హెచ్.ఓ. మరియు జిల్లా ఎస్పీ సులువుగా తెలుసుకొనే వెసులుబాటు ఉంటుందన్నారు. సమయ పాలన, గస్తీని, పహారాని పటిష్టం చేయడం వలనల నేరాలు తగ్గుముఖం పడతాయన్నారు.అత్యవసర సమయంలో బీటు సమాచారాన్ని విశ్లేషించి, నేర ప్రాధాన్యత ఉన్న ప్రాంతానికి బలగాలను సంఘటనా
స్ధలంకు పంపవచ్చునని జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ అన్నారు. ఈ-బీట్స్ యాప్ పని చేసే విధానాన్ని టెక్నీషియన్ హర్ష బందలం జూమ్ ద్వారా పోలీసు అధికారులు, సిబ్బందికి వివరించి, వారి సందేహాలను నివృత్తి చేసారు. ఈ జూమ్ మీటింగులో అదనపు ఎస్పీ (అడ్మిన్) పి.సౌమ్యలత,ఎస్బి సిఐలు ఎ.వి.లీలారావు, ఆర్.వి.ఆర్.కే.చౌదరి, ఇతర పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.