అచ్యుతాపురం (జనం న్యూస్): అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలం లాలం కోడూరు గ్రామంలో జనవరి 22 బుధవారం నాడు లాలం ఎరికిరెడ్డి నాయుడు, అదమ్మ తీర్థం సందర్భంగా ఆదివారం ఉదయం 9 గంటలకు పూజా కార్యక్రమం,9:30 నుండి జిల్లా స్థాయి వాలీబాల్ పోటీలు, సాయంత్రం 4గంటలకు తప్పెడగుళ్లు,తాడిపెద్దు సేవ, 5 గంటలకు చిన్నపిల్లలతో కోలాటం, రాత్రి 8 గంటలకు విశాఖ థ్రిలర్స్ వారిచే డాన్స్ బేబీ డాన్స్ వంటి పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగిందని లాలం ఎరికిరెడ్డి నాయుడు కుటుంబ సభ్యులు మరియు అఖిల భారత రామ్ చరణ్ యువత లాలం చందు తెలిపారు.