జనం న్యూస్, మే 17(తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్)
జగదేవపూర్ మండల బి అర్ ఎస్ పార్టీ సీనియర్ నాయకులు కొండపోచమ్మ మాజీ డైరెక్టర్ దాచారం కనకయ్య, పుట్టిన రోజు సందర్భంగా శుక్రవారం తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు, నివాసం లో మర్యాద పూర్వకంగా కలిసి పువ్వుల బొక్కే అందజేసి ఆశీర్వాదం తీసుకున్నారు.అనంతరం మాజీ మంత్రి వర్యులు హరీష్ రావు కనకయ్య ను శాలువాతో సన్మానించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజా సేవలో కొనసాగాలని,మండలం లో పార్టీ బలోపేతానికి నిరంతరం శ్రమిస్తూ కృషి చేస్తున్నావని చెప్పారు. భగవంతుడు నీకు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాలని, ఇలాంటి పుట్టిన రోజులు మరెన్నో జరుపుకోవాలని మంత్రి ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఆత్మ కమిటీ చైర్మన్ రంగారెడ్డి,మండల మాజీ కో ఆఫ్షన్ ఎక్బల్,మాజీ ఎంపీటీసీ కవిత, బి అర్ ఎస్ పార్టీ గ్రామ అధ్యక్షులు బుద్ధ నాగరాజు,బి అర్ ఎస్ పార్టీ మండల ఉప అధ్యక్షులు శ్రీను,మాజీ వార్డు సభ్యులు గణేష్,అలిమ్, బి అర్ ఎస్ పార్టీ నాయకులు బచ్చలిభాస్కర్,దండే భాస్కర్,అడ్డు, రాయవరం శ్రీను తదితరులు పాల్గొన్నారు.