జనం న్యూస్ //జనవరి //21//జమ్మికుంట //కుమార్ యాదవ్..కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలో ప్రజాక్రాంతి తెలుగు దినపత్రిక వార్షిక క్యాలెండర్ ను సోమవారం నాడు జమ్మికుంట మున్సిపల్ కమిషనర్ మొహమ్మద్ ఆయాజ్, జమ్మికుంట పట్టణ సీఐ వరగంటి రవి చేతుల మీదుగా క్యాలెండర్ ను ఘనంగా ఆవిష్కరించారు ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ మొహమ్మద్ ఆయాజ్ మాట్లాడుతూ ప్రజా క్రాంతి దినపత్రిక సుమారుగా 18 సంవత్సరాల నుండి ప్రజల గొంతుకగా వినిపిస్తూ పేద బడుగు బలహీన వర్గాల ప్రజల కు ప్రభుత్వానికి ప్రజాప్రతినిధులకు వారధిగా ఉంటూ ఎప్పటికప్పుడు ప్రజల సమస్యలను ప్రభుత్వానికి చేరవేస్తూ ప్రజాకాంత్రి దినపత్రిక ఎల్లవేళలా ముందుంటుందని అన్నారు, జమ్మికుంట పట్టణ సిఐ వరగంటి రవి, మాట్లాడుతూ ప్రజాక్రాంతి దినపత్రిక వార్షిక క్యాలెండర్ ను తమ చేతుల మీదుగా ఆవిష్కరించడం ఎంతో ఆనందంగా ఉందని ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా ఉంటూ ఎల్లవేళలా ముందుండాలని జమ్మికుంట ప్రజాక్రాంతి మండల విలేకరి ఎండి రఫీక్, కు సూచించారు ఈ ఆవిష్కరణ కార్యక్రమంలో తోటి విలేకరులు సౌడమల్ల యోహన్, ఎండి కాజా ఖాన్, రచ్చ రవికృష్ణ, సంతోష్, వంశీకృష్ణ కొలుగూరి నరేష్ తదితరులు పాల్గొన్నారు..