జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట మే 16 రిపోర్టర్ సలికినీడి నాగరాజు
దుర్గారావుకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన హ్యాపీ బాయ్స్
పట్టణంలోని పాటిమీద గల హ్యాపీ బాయ్స్ సభ్యుడైన కొమ్మనబోయిన దుర్గారావు జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమం ఓగేరు వాగు కొత్త బ్రిడ్జి దగ్గర ఉన్న మేకల వెంకయ్య సీతాఫలాలు తోటలో హ్యాపీ బాయ్స్ ఆధ్వర్యంలో దుర్గారావు జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించడం జరిగినది. హ్యాపీ బాయ్స్ అందరూ దుర్గారావు చేత కేక్ ని కట్ చేయించి కోలాహలంగా జన్మదిన పాటలతో శుభాకాంక్షలు తెలియజేశారు. ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని, జీవితంలో మరింత అభివృద్ధితో ముందుకు నడవాలని జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. దుర్గారావు మాట్లాడుతూ ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన హ్యాపీ బాయ్స్ కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో పాల్గొని తనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మేకల వెంకయ్య, మద్ది బోయిన కిషోర్, తులం కిషోర్, మద్ది బోయిన శేఖర్, తన్నీరు వంశీ, షేక్ నాగూర్, మంగు సాయి, కొండా పవన్, బాదనబోయిన సాంబశివరావు, పుట్టా వెంకట బుల్లోడు పాల్గొన్నారు.