జనం న్యూస్ // 20 జనవరి// జమ్మికుంట// కుమార్ యాదవ్..జమ్మికుంట లొ బస్ డిపో నిర్మించాలని పలు మండలాల ప్రజలు కోరుచున్నారు. హుజురాబాద్ లో బస్ డిపో హైవేపై ఉన్నందున, అక్కడ డిపో ఉన్నా లేకపోయినా ప్రజలకు ఇబ్బంది కలగదని అనుకుంటున్నారు. జమ్మికుంట పట్టణంలో రైల్వే స్టేషన్ ఉన్నందున, చుట్టుపక్కల మండల ప్రజలు దూర ప్రాంతాలకు వెళ్లాలి అంటే, ఉదయం ఐదున్నర గంటల వరకు రవాణా సౌకర్యం లేక, తీవ్ర ఇబ్బందులకు గురి అవుతున్నారు. ఇక్కడ డిపో నిర్మించడం వల్ల, సదరు ప్రాంతాలకు వెళ్లే ఆర్టీసీ బస్సులు రావడం వల్ల, ప్రయాణానికి ఇబ్బంది కలగకుండా ఉంటుందని, స్థానిక ప్రజలు, చుట్టుప్రక్కల మండలాల ప్రజలు, కోరుచున్నారు. ఉత్తర తెలంగాణలో రైల్వే స్టేషన్ తో పాటు, మార్కెటింగ్ వ్యాపార కేంద్రం ఎక్కువగా ఉన్నందున, చుట్టుపక్కల, పెద్దపల్లి , మరియు భూపాలపల్లి, రవాణా సౌకర్యం, ఎక్కువగా ఉండటం వల్ల, హుజురాబాద్ నియోజకవర్గం లో, ఎక్కువగా జమ్మికుంట మెయిన్ సెంటర్ అవడం వల్ల, ప్రధానంగా వ్యాపారం ఎక్కువగా జమ్మికుంటలో జరగడం, వల్ల ప్రజల సౌకర్యార్థం డిపో మంజూరు చేయగలరని, హుజురాబాద్ నియోజకవర్గం ఇన్చార్జి ఒడితల ప్రణవ్ కు, మరియు రోడ్డు రవాణా శాఖ మంత్రి పున్నం ప్రభాకర్ కు విజ్ఞప్తి చేస్తున్నామని, ప్రయాణికులు తెలిపారు.