జనం న్యూస్ మే 17( కొయ్యూరు ప్రతినిధి కృష్ణ ) అల్లూరి సీతారామరాజు జిల్లా కొయ్యూరు మండలం బూదరాళ్ళు గ్రామపంచాయతీ నూకరాయితోట గ్రామంలో ఎంపీపీ పాఠశాల కొరకు 13 లక్షలు సెంట్రల్ గవర్నమెంట్ నుండి మంజూరు చేసి ఉన్నారు. పాఠశాల విద్యా కమిటీ తీర్మానం ఆధారంలలో చైర్మన్ వైస్ చైర్మన్ పిల్లలు తల్లిదండ్రులు అందరు కలిసి తీర్మానం చేసుకున్న విధముగా ఎస్ఎంఎస్ ద్వారానే స్పెండర్ పెట్టి స్కూల్ బిల్లింగ్ నిర్మాణం చేయాలని వారు తీర్మానాలు చేసి ఉండగా స్థానిక పంచాయతీ చెందిన వివిధ పార్టీలు రాజకీయ నాయకులు సర్పం చ్ కుమారుడు వార్డ్ మెంబర్ సంజీవ్ ఎందుకు అడ్డుకునే ప్రయత్నాలు చేస్తున్నారు ఎందుకు ఏమిటో మాకు అర్థం కావటం లేదు ?. కొన్నిసంవత్సరాలు వర్షానికి తడుస్తూ, వాన గాలి రేకుల ఎగిరిపోయే పెచ్చులుగా గోడ లు రాలిపోతున్న ఈ స్కూల్లోనే పిల్లల చదువులు కొనసాగుతూ ఉండగా అయ్యా ! సర్పంచ్ తనయుడు వార్డ్ మెంబర్ సంజీవ్ ని ఎన్నోసార్లు చెప్పినా స్కూల్ గురించి పట్టించుకోలేదు. వివిధ పార్టీలకు చెందిన రాజకీయ నాయకులు సూచి కూడా చూడనట్టుగా పోయేవారు. మేం పేపర్ టెంట్మెంట్లు ఇచ్చి యూట్యూబ్లో పెట్టి పబ్లిక్ చేయడంతో గవర్నమెంట్ గుర్తించి నూకరాయితోట గ్రామంలో స్కూనిర్మాణం కొరకు బడ్జెట్ 13 లక్షల రూపాయలు మంజూరు చేస్తే ఎందుకు స్కూల్ నిర్మాణము జరగకుండా అడ్డుకొనే ప్రయత్నాలు ఇప్పుడు చేస్తున్నారు.?. స్థానిక పంచాయితీలో ఉన్న రాజకీయ నాయకులు స్కూల్ నిర్మాణం జరగకుండా ఎందుకు అడ్డుపడుతున్నారో మాకు అర్థం కావటం లేదు ?.మా గ్రామానికి ఒక స్కూలు బిల్లింగ్ కట్టకూడదా మా గ్రామానికి అభివృద్ధి జరగకూడదా మా గ్రామ పిల్లలకు చదువుకోకూడదా ఆదివాసులకు ఉన్నతమైన చదువులు చదవటం అవసరం లేదా స్థానిక ప్రజా ప్రతినిధులారా, రాజకీయ నాయకులు లారా పంచాయతీ సర్పంచ్ వార్డు మెంబర్లు లారా ఎందుకు మీరు మా గ్రామాన్ని కి స్కూలు బిల్లింగ్ కట్టనీయ కుండా అడ్డుకుంటున్నారు?. ఇదిమీకు న్యాయమా ధర్మమా ఒకసారి మీరే ఆలోచించండి . చాలా మంది పిల్లలు స్కూలు లేక విద్యకు దూరంగా ఉన్నారు అలాంటి గ్రామాలు చాలా ఉన్నాయి ఆగ్రామంలకు స్కూలు బిల్లింగ్ తెప్పించడానికి ప్రయత్నాలు చెయ్యండి.అంతేగానీ స్కూలు నిర్మాణాలు ఆపడం, అడ్డుపడడం అనేది మంచి పద్ధతి కాదు అంటూ వినియోగదారుల జిల్లా జాయింట్ సెక్రెటరీ భాస్కర రావు పేర్కొన్నారు