రాజ్యాంగ పరిరక్షణ సదస్సుకు హాజరవుతున్న ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్
మాల మహానాడు మండల అధ్యక్షులు మంచాల భూషణం
మే 17 జనం న్యూస్ వెంకటాపురం మండలం
ములుగు జిల్లా (నూగూరు) వెంకటాపురం మండలం ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ నందు సాధనపల్లి శ్రీను అధ్యక్షతన మాల మహానాడు ముఖ్య కార్యకర్తలు, శ్రేయోభిలాషుల సమక్షంలో రాజ్యాంగ పరిరక్షణ సదస్సు కరపత్రాలను విడుదల చేశారు అనంతరం మాల మహానాడు మండల అధ్యక్షులు మంచాల భూషణం మాట్లాడుతూ మే 25వ తేదీన భద్రాచలంలో కేకే ఫంక్షన్ హాల్ లో జరిగే రాజ్యాంగ పరిరక్షణ సదస్సు కు నూతన ఎమ్మెల్సీ తెలంగాణ దళిత ముద్దుబిడ్డ అద్దంకి దయాకర్ హాజరవుతారని ఈ సదస్సుకు ఎస్సి ఎస్టి బీసీ మైనార్టీ మరియు దళిత శ్రేయోభిలాషు లందరూ అధిక సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమం జయప్రదం చేయాలని అనంతరం నూతన ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ కు వెంకటాపురం మండలం మాల మహానాడు మండల కమిటీ ఆత్మీయ సన్మానం కార్యక్రమం నిర్వహించబోతున్నట్లు ఈ సందర్భంగా తెలియజేశారు ఈ సమావేశంలో కాల్వ సుందర్ రావు, సాధన పెళ్లి చిట్టిబాబు, సంఖ్య ఆదినారాయణ, గుండమల కిరణ్, జంపయ్య, యన్నమల్ల రవి, లకు మల్ల మోహన్, తోట మల్ల నాగార్జున, యనమల్ల నారాయణమూర్తి, యనమల ప్రణీత్, భరత్ కళ్యాణ్, మహేష్ మరియు మండల కాంగ్రెస్ అధ్యక్షులు సయ్యద్ హుస్సేన్, చిడెం శివ, రవి, రమేష్ తదితరులు పాల్గొన్నారు