ఏపీ స్టేట్ బ్యూరో చీఫ్/ రామిరెడ్డి (భండా రామ్) జనవరి 21 (జనం న్యూస్):ఏపీలో అర్హతలు లేకుండానే పింఛన్లు తీసుకుంటున్న వారిని ఏరివేసేందుకు అధికార యంత్రాంగం తనిఖీలు మొదలుపెట్టింది. తాజాగా దివ్యాంగుల కేటగిరీలో అర్హత లేని వారిని గుర్తించేందుకు అధికారులు సన్నద్ధం అవుతున్నారు.ఈ నెల 22 నుంచి 30 వరకు పీజీ వైద్య విద్యార్థులు రోజుకు 200మంది లబ్ధిదారులకు చొప్పున పరీక్షలు నిర్వహించనున్నారు. ఒకవేళ వైద్య పరీక్షలకు వెళ్లకపోతే ఫిబ్రవరి 1 నుంచి అనర్హులకు పింఛన్‌ను నిలిపి వేయనున్నారు.