మండల విద్యాధికారి పి విట్టల్
జనం న్యూస్ మే 19 చిలిపి చెడు మండల ప్రతినిధి
మెదక్ జిల్లా చిలిపిచేడు మండలంలో ప్రభుత్వ ఆదేశానుసారం మన చిలిపిచెడ్ మండలంలో ఈనెల 20వ తేదీ నుండి 24 వ తేదీ వరకు ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు మండలంలోని ప్రాథమిక పాఠశాలల ఉపాధ్యాయిని ఉపాధ్యాయులందరికీ మరియు ప్రధానోపాధ్యాయులకు వృత్యంతర శిక్షణ కార్యక్రమం స్థానిక కేజీబీవీ చిట్కుల్ నందు కలదు . ఈ కార్యక్రమం ఉపాధ్యాయుల విద్యా బోధనలో అదేవిధంగా విద్యార్థుల విద్యాభివృద్ధికి ఎంతగానో తోడ్పడుతుంది కాబట్టి ఉపాధ్యాయులందరూ సకాలంలో శిక్షణ కార్యక్రమానికి విచ్చేసి విజయవంతం చేయాలని చిలిపిచెడ్ మండల విద్యాధికారి విట్టల్ తెలియజేశారు.ఈ శిక్షణ కార్యక్రమంలో మండల రిసోర్స్ పర్సన్లు గా సునీల్,నాగేందర్ రెడ్డి, మహేష్, వెంకటక్రిష్ణ, సుజాత, నవీన్,పండరి, యాదయ్య వ్యవహరించనున్నారు