జనం న్యూస్ కాట్రేనికోన మే 18 (ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ)
ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కాకినాడ (జిల్లా సహకార కేంద్ర బ్యాంకు) నూతన చైర్మన్ గా నియమితులైన తుమ్మల రామస్వామి బాబు ను ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా సర్పంచ్ ల సమైక్య ప్రధాన కార్యదర్శి, కాట్రేనికోన మండలం ఉప్పూడి గ్రామ పంచాయతీ సర్పంచ్ రంభాల రామారావు (రమేష్ ) కాకినాడ లో కార్యాలయం నందు మర్యాద పూర్వకంగా కలిశారు. నూతనం గా చైర్మన్ గా నియమితులైన సందర్బంగా శాలువా తో సన్మానించారు. శుభాకాంక్షలు తెలిపారు. భవిష్యత్ లో మరిన్ని ఉన్నత పదవులు చేపట్టాలని, భగవంతుని ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షించారు