పదోన్నతి ద్వారానే పోలీసులకు గుర్తింపు, ఉత్సాహం : జిల్లా ఎస్పీ డివి శ్రీనివాస రావు ఐ.పి.ఎస్
జనం న్యూస్ 19 మే ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో
కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా పరిధి సివిల్ విభాగం లో వివిధ పోలీస్ స్టేషన్స్ లో పనిచేస్తు హెడ్ కానిస్టేబుల్ నుండి ఎఎస్ఐ లుగా పదోన్నతి పొందిన ఇద్దరు అధికారులకు ఎస్పీ డివి శ్రీనివాస రావు వారి కార్యాలయంలో అభినందించి వారి ర్యాంక్ పదోన్నతి చిహ్నంను అలకరించి శుభాకాంక్షలు తెలిపారు.
పదోన్నతి పొందిన పోలీస్ అధికారులు 1.మీర్ ఉస్మాన్ అలీ - ఆసిఫాబాద్ పోలీస్ స్టేషన్ 2.డి. బాబాజీ - కౌటాల పోలీస్ స్టేషన్ ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ…. పదోన్నతులతోనే పోలీసులకు గుర్తింపు, ఉత్సాహం వస్తుందని ఎలాంటి రిమార్క్ లేకుండా మిగిలిన సర్వీసును పూర్తి చేసి విధుల్లో మంచి పనితీరు కనబరిచి మరిన్ని పదోన్నతులు పొందాలని అన్నారు. పోలీసు శాఖలో పదోన్నతి ద్వారా స్థాయితో పాటు బాధ్యత పెరుగుతుందని, పెరిగిన బాధ్యతను క్రమశిక్షణాయుతంగా నిర్వహిస్తూ ప్రజలలో పోలీస్ శాఖ పట్ల నమ్మకాన్ని, గౌరవాన్ని పెంచే విధంగా ఉండాలని అన్నారు. ఇప్పటివరకు ఎలాంటి క్రమశిక్షణతో విదులు నిర్వహించారో అదేవిధంగా మిగతా సర్వీస్ పూర్తి చేసి మరిన్ని పదోన్నతులు పొందాలని ఈ సందర్భంగా ఎస్పీ తెలియజేశారు. ఈ కార్యక్రమం లో ఆర్ఐ ఎం.టి.ఓ అంజన్న , సి.సి కిరణ్ లు పాల్గొన్నారు.