జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా.
నందలూరు పోలీస్ స్టేషన్ నూతన ఎస్సైగా బాధ్యతలు చేపట్టిన మల్లికార్జునరెడ్డి ని మండల సర్పంచ్ ల సంఘం అధ్యక్షులు నాగిరెడ్డిపల్లి మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ జంబు సూర్య నారాయణ బుధవారం మర్యాడ పూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించారు. ప్రశాంత వాతావరణంలో విధులు నిర్వహిస్తూ ఆసాంఘిక శక్తుల పట్ల తమదైన శైలిలో వ్యవహరిస్తూ మంచి పాలన అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ కమిటీ డైరెక్టర్ బేస్త సుబ్రహ్మణ్యం వార్డు సభ్యులు నాగేంద్ర తెదేపా నాయకులు తుమ్మాది శివకుమార్ లు పాల్గొన్నారు.