జనం న్యూస్. జనవరి 21. సంగారెడ్డి జిల్లా. హత్నూర. కాంసెన్సీ ఇన్చార్జ్.(అబ్దుల్ రహమాన్)తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ 2025-2026. విద్యా సంవత్సరానికి గాను ఐదవ తరగతిలో ప్రవేశాల కోసం ఉమ్మడి ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నట్లు ఎస్సీ ఎస్టీ బీసీ జనరల్ గురుకులాల్లో ఐదవ తరగతి ప్రవేశాల కొరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్లు గురుకుల కళాశాల పాఠశాల ప్రిన్సిపల్ భిక్షమయ్య పత్రిక ప్రకటనలో తెలిపారు. ఆసక్తి కలిగిన విద్యార్థులు నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తుందని అన్నారు. ఎస్సీ ఎస్టీ గురుకులాల్లో ఆరవ. తరగతి నుండి తొమ్మిదవ. తరగతి వరకు ఖాళీగా ఉన్నచోట దరఖాస్తులు స్వీకరించబోతుందని. ఎస్సీ గురుకులంలోని గౌలి తొట్టి అలుగునూరు సిఓఈ లలో 9వ తరగతి లో ప్రవేశాల కొరకు ఆసక్తి కలిగిన విద్యార్థుల నుండి దరఖాస్తుల స్వీకరిస్తు ఎస్సీ గురుకులంలోని రుక్మాపూర్ సైనిక్ స్కూల్ మల్కాజ్గిరి ఫైన్ ఆర్ట్స్ స్కూల్ లో ఆరవ తరగతిలో ప్రవేశం కోసం దరఖాస్తులు స్వీకరిస్తుందని తెలిపారు. పైన పేర్కొన్న అన్ని ప్రవేశాల పరీక్షలకు ఆసక్తి కలిగిన విద్యార్థులు మీ యొక్క దరఖాస్తును వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో మాత్రమే సమర్పించాలన్నారు. పైన పేర్కొన్న అన్ని ప్రవేశాల పరీక్షలకు దరఖాస్తు రుసుము ఆన్లైన్లో 100 రూపాయలు చెల్లించవలసి ఉంటుందన్నారు. దరఖాస్తు చేసుకొనుటకు చివరి తేదీ.01.02.2025. వరకు ఉంటుందని. పరీక్ష నిర్వహణ తేదీ. 23. 02. 2025. రోజున మొదలవుతుందన్నారు. దరఖాస్తు చేసుకోవటానికి కావలసిన సర్టిఫికెట్లు.1. కుల ధ్రువీకరణ పత్రము.2. ఆదాయ ధ్రువీకరణ పత్రము.3. ఆధార్ కార్డు. 4.జనన ధ్రువీకరణ పత్రము. 5.విద్యార్థి ఫోటో. ముఖ్య గమనిక. సర్టిఫికెట్ సత్వర జారి కోసం సంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయ సహాయ కేంద్రంలో. ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5. గంటల వరకు ఏర్పాటు చేశారని తెలిపారు.