హనుమాన్ చాలీసా తో మారుమోగిన ఆలయాలు.
జనం న్యూస్,22మే, జూలూరుపాడు:
హనుమాన్ జయంతి పండుగ సందర్భంగా మండలంలోని శ్రీసీతా రామచంద్ర స్వామి దేవాలయం, హనుమాన్ దేవాలయం,శివాలయాల్లో హనుమాన్ జయంతి పండుగ ఆయా దేవాలయాల అర్చకులచే వేద మంత్రాలతో అభిషేకాలు, ప్రత్యేక పూజ్యాధికార్యక్రమాలు,హోమాలు నిర్వహించారు అనంతరం ఆయా దేవాలయాల్లో హనుమాన్ చాలీసా పారాయణం, రామ నామ,హరి నామ, శివ నామ కీర్తనలతో,భజనలతో దేవాలయ ప్రాంగణం మారుమోగాయి,ఆలయ కమిటి,భక్తులచే భక్తులందరికి తీర్థప్రసాదలు,అన్నప్రసాద వితరణ కార్యక్రమం చేపట్టారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని స్వామివారి కృపకు పాత్రులు అయ్యారు.