జనం న్యూస్ 22 జనవరి విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్... రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి పంచాయతీలో ఒక మోడల్ ప్రైమరీ పాఠశాలను ఏర్పాటు చేయాలని యుటిఎఫ్ జిల్లా అధ్యక్షుడు కె.శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. మోడల్ పాఠశాల ఏర్పాటు చేసి ప్రభుత్వ పాఠశాలల్లో తెలుగు, ఇంగ్లీషు మీడియంలను అమలు చేయాలని కోరుతూ మంగళవారం విజయనగరం MEO కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ప్రభుత్వ విద్యను నిర్వీర్యం చేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కుట్ర పన్నుతున్నాయని విమర్శించారు