జనం న్యూస్, మే 27, ముమ్మిడివరం ప్రతినిధి
ముమ్మిడివరం మండలం కమినిలంక గోదావరి లో 8 మంది యువకులు సోమవారం స్నానానికి దిగి గల్లంతైన ప్రాంతాన్ని మంగళవారం బీజేపీ ముమ్మిడివరం అసెంబ్లీ కన్వీనర్ గోలకోటి వెంకటరెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ఆయన మాట్లాడుతూ అన్ని విభాగాల అధికారులు మృతి దేహాల వెలికితీతకు విశేష కృషి చేస్తున్నారని అన్నారు. ఈ సంఘటన జరగడం చాలా విషాదకరం అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి గనిశెట్టి వెంకటేశ్వరరావు, జిల్లా ఉపాధ్యక్షులు గ్రంధి నానాజీ, సీనియర్ నాయకులు మట్టా సూరిబాబు, బొంతు కనకారావు, మేళం మురళి, శీలం కృష్ణ, యనమదల వెంకటరమణ పాల్గొన్నారు.