జనం న్యూస్ 22 జనవరి 2025 విష్ణు వర్ధన్ గౌడ్ జనం న్యూస్ జిల్లా బ్యూరో ఇంచార్జీ జోగులాంబ గద్వాల్ జిల్లా... గద్వాల:-విద్యుత్ సంస్థల్లో పనిచేస్తున్న ఆర్టిజన్స్ను కన్వర్షన్ చేయాలని తెలంగాణ విద్యుత్ ఆర్టిజన్స్ కన్వర్షన్ జేఏసీ కోరింది. ఈ మేరకు మంగళ వారం టివిఏసి జేఏసీ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని టివిఏసి కార్యాలయం ముందు విద్యుత్ సంస్థల్లో పనిచేస్తున్న ఆర్టిజన్స్ను కన్వర్షన్ చేయాలని రిలే నిరాహార దీక్షలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... వీరి ఆధ్వర్యంలో 20 వేల మంది ఆర్టిజన్ కార్మికులను కన్వర్షన్ చేయాలని అనేక పోరాటాలు చేశాము అని అన్నారు. అయిన రాష్ట్ర ప్రభుత్వం గానీ యజమాన్యం గాని ఇంతవరకు స్పందించలేదు. మా ఆర్టిజన్స్ కాన్వర్షన్ అనే డిమాండ్ సాధించడం కోసం రాష్ట్ర జేఏసీ ఇచ్చిన పిలుపుమేరకు ఈ నెల 20 తేదీ నుండి 24వ తేదీ వరకు అనగ మంగళవారం రెండవ రోజు రిలే నిరాహర దీక్ష "ప్రారంభించి 80 మంది ఆర్టిసన్ కార్మికులతో విజయవంతం చేయడం జరిగింది అని టివిఏసి జేఏసీ తెలిపారు.ఈ కార్యక్రమం లో పాల్గొన్నవారు జిల్లా చైర్మన్ పరుమాల రాజు, కన్వీనర్ డీకే రామకృష్ణ, అధ్యక్షులు కుమార్,కో చైర్మన్ శివప్రసాద్,కో కన్వీనర్ అఖిల్ అహ్మద్,జాయింట్ సెక్రటరీ మద్దిలేటి,కోశదీకారి లోకేశ్వర్ రెడ్డి వాజీద్, వెంకట్రాములు,సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.