జిల్లా కార్యవర్గ సభ్యులుగా భాష బోయిన సంతోష్.
సిపిఐ జిల్లా సమితి సభ్యులుగా ఉట్కూరి ప్రణీత్ గౌడ్ ఏకగ్రీవంగా ఎన్నిక..
జనం న్యూస్ 28 మే 2025 ( ఎల్కతుర్తి మండల్ బండి కుమారస్వామి రిపోర్టర్)
ఎల్కతుర్తి మండలం నుండి విద్యార్థి ఉద్యమ నాయకులుగా రాణించి 26, 27 తేదీలలో సిపిఐ హనుమకొండ జిల్లా మహాసభలో భాష బోయిన సంతోష్ సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులుగా, ఉట్కూరి ప్రణీత్ గౌడ్ సిపిఐ జిల్లా సమితి సభ్యులుగా ఏకగ్రీవంగా ఎన్నిక కావడం అభినందనీయం. గత కొన్ని సంవత్సరాలుగా ఎల్కతుర్తి మండలం నుండి విద్యార్థి ఉద్యమంలో ప్రయాణం మొదలుపెట్టి అనేక రకాల ఉద్యమాలు, పాఠశాల సమస్యలపై, హాస్టల్ సమస్యలపై స్కాలర్షిప్ రియంబర్స్మెంట్ విడుదలపై ఎన్నో రకాల ఉద్యమాలు చేసి ఎన్నో కేసులు మీద వేసుకొని చివరికి జైలు జీవితం గడిపి పేద బడుగు బలహీన వర్గాల విద్యార్థుల కోసం ఎనలేని కృషి చేస్తూ జిల్లా స్థాయిలో విద్యార్థి ఉద్యమంలో గుర్తింపు తెచ్చుకున్న ఎల్కతుర్తి మండలం సూరారం గ్రామం ముద్దుబిడ్డ ప్రస్తుతం ఏ ఐ ఎస్ ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహిస్తున్న కామ్రేడ్ భాష బోయిన సంతోష్ సిపిఐ హనుమకొండ జిల్లా కార్యవర్గ సభ్యులుగా ఎన్నికైనందున అదేవిధంగా ఎల్కతుర్తి మండలం గోపాల్ పూర్ ముద్దుబిడ్డ ప్రస్తుతం ఏఐ ఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులుగా బాధ్యతలు నిర్వహిస్తున్న ఉట్కూరు ప్రణీత్ గౌడ్ సిపిఐ హనుమకొండ జిల్లా సమితి సభ్యునిగా ఎన్నికైనందున ఇది మన ఎల్కతుర్తి మండలానికి గర్వకారణం అని వారు మరింత విద్యార్థి ఉద్యమంలో సిపిఐ పార్టీలో అంచలంచలుగా ఎదిగి పేద బడుగు బలహీన వర్గాల ప్రజల సమస్యల పరిష్కారం కోసం ఎనలేని పోరాటాలు నిర్వహించాలని కోరుకుంటూ వారికి హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేశారు.