జనం న్యూస్ మే 30(మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్)
రైతులకు నాణ్యమైన విత్తనాలను విక్రయించాలని మునగాల మండల ప్రత్యేక అధికారి డిప్యూటీ సీఈవో శిరీష అన్నారు. గురువారం మునగాల మండల కేంద్రంలో విత్తన దుకాణాల్లో విత్తనాలను మునగాల మండల ఎంపీడీవో రమేష్ దీన్ దయాల్, మండల వ్యవసాయ అధికారి రాజుతో కలిసి పరిశీలించారు. మండలంలోని రైతులందరికీ నాణ్యమైన విత్తనాలు అమ్మాలని, సమయానికి అనుగుణంగా విత్తన కొరత రాకుండా విత్తనాలను అందుబాటులో ఉంచాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ విత్తనాలను వాటి ఎమ్మార్పీ ధర కంటే ఎక్కువ రేటుకు అమ్మకూడదని డీలర్లకు తెలియజేశారు. లైసెన్స్ కలిగిన డీలర్ వద్ద నుంచి,బిల్ తీసుకొని మాత్రమే రైతులు విత్తనాలు కొనుగోలు చేయాలని తెలియజేశారు. పక్క రాష్ట్రాల నుంచి విత్తనాలు తీసుకోవద్దని అని, నకిలీ విత్తనాలు, లూజు విత్తనాలు అమ్మే వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని రైతులకు సూచించారు.విత్తన దుకాణదారులు రైతులకు నాణ్యమైన విత్తనాలను విక్రయించాలని డీలర్లకు సూచించారు. రైతులు విత్తన కొనుగోలు విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని రైతులకు సూచించారు.