మద్నూర్ మే 29 జనం న్యూస్
కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం లో అభివృద్ధి చెందాలంటే జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావుకు మంత్రి పదవి ఇవ్వాలని మద్నూర్ ఏఎంసీ చైర్ పర్సన్ సౌజన్య రమేష్ ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా ఎఎంసి చైర్పర్సన్ మాట్లాడుతూ… జుక్కల్ నియోజకవర్గం 1978లో ఎస్సీ నియోజకవర్గం గా రిజర్వ్ అయిన సంగతి మీకు తెలిసినదే, ఆనాటి నుంచి నేటి వరకు ఎంతోమంది ఎమ్మెల్యేలుగా ఇకనుండి ప్రాతినిధ్యం వహించిన్రు కానీ ఎలాంటి అభివృద్ధి చెందలేదు. ఈ నియోజకవర్గం వెనుకబడింది కాదు వెనుకకు నెట్టబడింది. ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉన్నట్టున్న నియోజకవర్గంలో మొదటిసారిగా అభివృద్ధి ఫలాలను చూస్తున్నారు ప్రజలు, అంటే ప్రస్తుతం ఎమ్మెల్యే పేదల పెన్నిధి గౌరవశాసనసభ్యులు శ్రీ లక్ష్మీ కాంతారావు తోట గారి సమయంలోనే అని గర్వంగా చెప్పగలం అందుకు నిదర్శనం..ఇంటిగ్రేటెడ్ స్కూల్.
కేంద్రీయ విద్యాలయం. లేండి ప్రాజెక్ట్ కు నిధులు. జుక్కల్ కాంసెన్సీ లో సిసి రోడ్డు లేని గ్రామం లేదు.
విద్యా వ్యవస్థ పై ప్రత్యేక దృష్టి. గత పాలనలో 10 సంవత్సరాల కాలంలో జుక్కల్ కానస్టెన్సీ లో ఒక్క డబుల్ బెడ్ రూమ్ కూడా లేకుండే. కానీ ప్రస్తుతం మా ఎమ్మెల్యే ఒక్క సంవత్సరంలోనే కానస్టెన్సీలోని ప్రతి గ్రామానికి ఇందిరమ్మ ఇండ్లు లేని గ్రామం లేదు ఇందిరమ్మ ఇండ్లు ప్రస్తుతం నిర్మాణ దశలోఉన్నాయి . ఇంత మంచి ఎమ్మెల్యేను ప్రజలు గెలిపించినందుకు ఈ నియోజకవర్గంలో అభివృద్ధి చెందాలి అంటే మహారాష్ట్ర కర్ణాటక తెలంగాణ రాష్ట్రాల కు అనుసంధానంతో ఉన్న జుక్కల్ నియోజకవర్గం కామారెడ్డి జిల్లాకు వన్నె తెచ్చే విధంగా ఉండాలంటే అది ఇరు రాష్ట్రాల వ్యాపార భాగస్వామ్యంతో యావత్ తెలంగాణ రాష్ట్రానికే ఒక దిక్సూచిగా కావడానికి విద్యావంతుడు, పరిశోధనలో డాక్టరెట్ పూర్తి చేసిన పరిశోధకుడు శ్రీ లక్ష్మి కాంతారావు తోట గారికి మంత్రి పదవి ఇవ్వడం వల్ల అది సాధ్యమవుతుందని మేము పూర్తిగా నమ్ముతున్నాం. యావత్ తెలంగాణ రాష్ట్రంలోని అధిక సంఖ్యలో ఉన్న మాదిగలకు న్యాయం చేయాలి అంటే విద్యావంతుడైన పరిశోధకుడైన ఎమ్మెల్యే డాక్టర్ లక్ష్మీ కాంతారావు తోట గారికి మంత్రి పదవి ఇవ్వడం వల్లనే అది సాధ్యమవుతుందని మేము పూర్తిగా విశ్వసిస్తున్నాము.