కాంగ్రెస్ పార్టీ నాయకులు..
జనం న్యూస్ 29 మే 2025 (ఎల్కతుర్తి మండల్ బండి కుమారస్వామి రిపోర్టర్)
ఎల్కతుర్తి మండల పరిధిలోని జగన్నాథ్ పూర్ గ్రామ నివాసి ముటికే కుమార స్వామి కి ముఖ్యమంత్రి సహాయనిధి కింద 60.000 వేల రూపాయల గల చెకు ను కాంగ్రెస్ పార్టీ గ్రామశాఖ అధ్యక్షులు ముస్కే శ్రీనివాస్ ఆధ్వర్యములో భాదితునికి చెక్ ను అందించినట్లు శ్రీనివాస్ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మూటీకే కుమారస్వామి ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా ఆరోగ్యం బాగుకోసం ఈ సహాయ నిధిని చెక్కును అందించామని ఈసందర్భంగా అన్నారు. ఈ కార్యక్రమములో చిర్ర సుదర్శన్ గౌడ్, పెండ్యాల భాస్కర్, ఆరేపల్లి సమ్మయ్య, పెండ్యాల సామెల్, గూటం శ్రీనివాస రెడ్డి, కాంగ్రెస్ పార్టీ యూత్ నాయకులు కార్తీక్, పంజాల అభిషేక్, రవీందర్, కొండల్ రెడ్డి, రామరాజ్ తదితరులు పాల్గొన్నారు.