కాంగ్రెస్ పార్టీ నాయకులు
జనం న్యూస్ 29 మే 2025 (ఎల్కతుర్తి మండల్ బండి కుమార్ స్వామి రిపోర్టర్)
ఎల్కతుర్తి మండలం జిలుగుల గ్రామంలో ముష్కే స్వరూప భర్త కుమారస్వామి లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును కుటుంబ సభ్యులకు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా 30.000 వేల రూపాయల మంజూరైన చెక్కును గురువారం రోజున కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు తౌటం నరేందర్ ఆధ్వర్యంలో అందజేయడం జరిగింది. అనంతరం గ్రామ శాఖ అధ్యక్షులు నరేందర్ మాట్లాడుతూ. నిరుపేదలకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా చికిత్సకు ఆర్థిక సాయం అందిస్తుందని అన్నారు. లబ్ధిదారులు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మంత్రి పొన్నం ప్రభాకర్ కి కృతజ్ఞతలు ఈ సందర్భంగా తెలియజేశారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు తౌటం నరేందర్, మాజీ సర్పంచులు గూటం జోగిరెడ్డి, రావుల రమేష్, ఉప సర్పంచ్ తంగేళ్ల ప్రవీణ్ కుమార్, కాంగ్రెస్ నాయకులు రావుల గుండయ్య, రావుల కుమారస్వామి,బండి సుధాకర్, కుక్కల రాయమల్లు, సోనబోయిన కొమురయ్య, పైడిపల్లి కృష్ణంరాజు, ఆరెపల్లి ప్రభాకర్, పైడిపల్లి రాములు, వేముల జ్ఞానేశ్వర్, ఆరెపల్లి వంశీ తదితరులు పాల్గొన్నారు.