గ్రామం జోలికి వస్తె ఊరుకునేది లేదు
గ్రామ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాం
జనం న్యూస్ మే 29 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో
కొమురం భీం ఆసిఫాబాద్ మండలంలోని ఇప్పలనవేగం గ్రామాన్ని కాలి చేయాలని కొందరు భూస్వాములు కొంత కాలంగా ఆ గ్రామ ప్రజలను బెదిరిస్తున్నారని విషయం తెలుసుకున్న భాజపా సీనియర్ నాయకులు, వన్ నేషన్ వన్ ఎలక్షన్ జిల్లా కన్వీనర్ అరిగెల నాగేశ్వరావు గురువారం ఆగ్రామాన్ని సందర్శించి గ్రామస్థులకు అండగా ఉన్నానని బరోసా ఇచ్చారు,గత కొంత కాలంగా ఆ గ్రామం పట్టా భూములలో ఉందని,కొందరు భూ పట్టదారులు వచ్చి గ్రామాన్ని త్వరలోనే కాలి చేయాలని లేదంటే దౌర్జన్యంగా కాలి చేస్తామని బెదిరిస్తున్నారని అన్నారు,గత వంద సంవత్సరాలనుండి ఆ గ్రామంలోనే ఉంటున్నామని గ్రామస్థులు అరిగెల దృష్టి కి తీసుకావచారు,గ్రామాన్ని సందర్శించిన అరిగెల గ్రామస్థులకు బరోసా ఇచ్చారు అధికారులతో మాట్లాడి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని గ్రామస్థులకు హామీ ఇచ్చారు,గత వంద సంవత్సరాలనుండి ఈ గ్రామం ఇక్కడే ఉందని,దీనిని ఎక్కడికి తరలించేది లేదని అన్నారు,గ్రామస్థులు భయపడే అవసరం లేదని మీకు అండగా నేను ఉంటానని అన్నారు,అలాగే ఇప్పలనవేగం నుండి దానపూర్ వరకు ఎంపీ నిధులతో త్వరలోనే రోడ్డు ఏర్పాటుకు కృషి చేస్తానని అన్నారు వీరి వెంట భాజపా మండల అధ్యక్షులు సుంకరి పెంటయ్య,సింగిల్ విండో వైస్ చైర్మెన్ రుకుం ప్రహ్లాద్,భాజపా నాయకులు ఐలవేని సంతోష్,శ్రీకాంత్,గ్రామస్థులు ఉన్నారు