93 లక్షల రూపాయల యూజిడి పనులకు శంకుస్థాపన
జనం న్యూస్ మే 30 సంగారెడ్డి జిల్లా
జిహెచ్ఎంసి పరిధిలోని రామచంద్రపురం, భారతీనగర్, పటాన్చెరు డివిజన్ల పరిధిలో మౌలిక వసతుల కల్పనకు ప్రణాళికాబద్ధంగా నిధులు కేటాయిస్తున్నామని పటాన్ చేరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. పటాన్చెరు డివిజన్ పరిధిలోని జెపి కాలనీ, చైతన్య నగర్ కాలనీలలో 93 లక్షల రూపాయల వ్యయంతో చేపట్టనున్న యు జి డి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. డివిజన్ల పరిధిలో నూతన అంతర్గత రహదారులు, యుజిడీల నిర్మాణ పనులకు నిధులు కేటాయిస్తున్నామని తెలిపారు. ప్రజలకు మెరుగైన పరిపాలన అందించేందుకు కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పటాన్చెరు కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విజయ్ కుమార్, HMWS డీజీఎం శివకృష్ణ, సీనియర్ నాయకులు కొమరగూడెం వెంకటేష్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.