జాతీయ జెండాను ఆవిష్కరించిన మున్సిపాలిటీ కమిషనర్ ఖయ్యూం…..
బిచ్కుంద జూన్ 2 జనం న్యూస్
కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండలంలోని తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకల సందర్భంగా సోమవారం బిచ్కుంద మున్సిపాలిటీ కార్యాలయంలో ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు బిచ్కుంద మున్సిపాలిటీ కార్యాలయంలో కమిషనర్ ఖయ్యూం జాతీయ జెండా ఆవిష్కరించారు అనంతరం మున్సిపల్ కమిషనర్ పిల్లలకు నోట్ బుక్ పంపిణీ చేశారు. ఇట్టి కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మల్లికార్జున అప్ప సెట్ కార్, నౌషా నాయక్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ అశోక్, సీమ గంగారం, నాగరాజ్, లింగురాం, కలీం తుకారం అశోక్ మున్సిపాలిటీ సిబ్బంది మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు