జనం న్యూస్ జాన్ 04 (మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్)మునగాల మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల జూనియర్ కాలేజి లో ఇంగ్లీషులో బోధించుటకు మునగాల నందు ఖాళీగా ఉన్నటువంటి జూనియర్ లెక్చరర్ పోస్టులకు గెస్ట్ పద్ధతిలో ఎంపీసీ మరియు బైపిసి గ్రూపులకు బోధించుటకు స్థానిక మండలంలోని మహిళా అభ్యర్థుల నుండి అప్లికేషన్ లు స్వీకరిస్తున్నామని మునగాల మండల విద్యాధికారి వెంకటేశ్వర్లు మంగళవారం ఒక పత్రిక ప్రకటనలో తెలిపారు. సంబంధిత స్టడీలో ఎమ్మెస్సీ, బీఈడీ అర్హత కలిగిన వారు తెలుగు 01, ఇంగ్లీష్ 01, మ్యాథ్ 01, ఫిజిక్స్ 01, కెమిస్ట్రీ 01, బోటనీ 01, జువాలజీ 01, పోస్టులకు గాను తేదీ 04-06-2025 నుండి 07-06-2025 వరకు కాలేజీలో స్పెషల్ ఆఫీసర్ కి దరఖాస్తులు సమర్పించాలని మండల విద్యాధికారి వెంకటేశ్వర్లు, ఎస్ ఓ సునీత రాణి తెలియజేశారు. ఈ దరఖాస్తులు చేసుకునే అవకాశం మునగాల మండలం లోని గ్రామాలలో ఎమ్మెస్సీ,బీఈడీ,టిఈటి క్వాలిఫై అయిన మహిళా అభ్యర్థుల నుండి మాత్రమే అప్లికేషన్స్ స్వీకరించబడతాయని తెలియజేశారు.