ప్రభుత్వబడులను కాపాడుకుందాం
టీపిటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు సి హెచ్,అనిల్ కుమార్
జనం న్యూస్, జూన్ 4 ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్)
జగదేవపూర్ మండలం అనంతసాగర్ లో తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో బడిబాట ప్రచార, కళాజాత కార్యక్రమంలో భాగంగా సాగిన బహిరంగ సభలో టీ పి టీ ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు సి హెచ్,అనిల్ కుమార్, మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలోనే అనుభవం గల ఉపాధ్యాయుల బోధన ద్వారా నాణ్యమైన గుణాత్మక విద్య లభిస్తుందని అన్నారు. ప్రభుత్వ పాఠశాలలో విశాలమైన తరగతి గదులు, డిజిటల్ బోధన, కంప్యూటర్ శిక్షణ, పౌష్టికాహారం మధ్యాహ్న భోజనం, అల్పాహారంగా రాగిజావా, ఉచిత ఏకరూప దుస్తులు, త్రాగునీరు టాయిలెట్ లాంటి సకల సౌకర్యాలతో, విద్యార్థులను పోటీపరీక్షలకు సంసిద్ధులను చేస్తామని తల్లిదండ్రులకు హామీలను ఇస్తూ విద్యార్థుల నమోదు కార్యక్రమాన్ని చేపట్టి ప్రభుత్వ పాఠశాల బలోపేతానికి టీపీటీఎఫ్ సంఘం కృషి చేస్తుందని తెలియజేశారు. తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించి అందుబాటులో ఉన్న ప్రభుత్వ బడులను కాపాడుకొని, అభివృద్ధి చేసుకోవల్సన అవసరం ఉంది తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నన్నెబోయిన తిరుపతి మాట్లాడుతూ ప్రభుత్వ బడి మీ అందరిదని మీ కష్టార్జితమే మా జీతాలు అని అందుకే పాఠశాలలో మీ పిల్లల్ని చేర్పించాలని అన్నారు. రాష్ట్ర కార్యదర్శి డి.రాజయ్య జిల్లా ప్రధాన కార్యదర్శి యస్. నరేందర్ ,గజ్వేల్ జోన్ కన్వీనర్ జె.శ్రీనివాస్, పాపిరెడ్డి సీనియర్ నాయకులు రాంచంద్రం, రాజులు, సత్తయ్య, నేతి శంకర్,నర్సింలు గౌడ్,రాములు, శ్రీనివాస్, విద్యాసాగర్ పాల్గొన్నారు.