జనం న్యూస్ జాన్ 05(మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్)
భూ సమస్యలను పరిష్కరించటానికే రెవిన్యూ సదస్సులను నిర్వహించటం జరుగుతుందని కోదాడ ఆర్డివో సూర్యనారాయణ అన్నారు. బుధవారం మునగాల మండల పరిధిలోని గణపవరం గ్రామంలో రెవిన్యూ సదస్సులో ఆయన పాల్గొని రైతుల వద్ద నుంచి దరఖాస్తులు స్వీకరించారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. ఈ సదస్సుల ద్వారా రైతులు తమ సమస్యను ధరఖాస్తు రూపంలో సమర్పించాలని తదుపరి క్షేత్ర స్థాయి లో విచారణ చేసి సమస్య పరిష్కరించటం జరుగుతుందని తెలిపారు.