జనం న్యూస్ జనవరి 22 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో:- ఆసిఫాబాద్ పట్టణంలోని శ్రీ వాసవి విద్యా మందిర్ 2013 14 పదవ తరగతి విద్యార్థులు అదే తరగతికి చెందిన మాల్కడి తిలక్ కీ విద్యార్థికి 82000 ఆర్థిక సాయం అందజేశారు ఈ సందర్భంగా పూర్వ విద్యార్థులు మాట్లాడుతూ మొదటి నుండి కష్టపడి చదివి వ్యక్తిత్వం గలవారని పేదరికం సవాల్ చేస్తూ ఎంబిబిఎస్ పూర్తి చేసి ఏం డి జనరల్ మెడిసిన్ లో సీటు సంపాదించడం చాలా గర్వించదగ్గ విషయమని కాబట్టి ఇటువంటి విద్యార్థులకు అండగా ఉండడం బాధ్యత అన్నారు భవిష్యత్తులో ఇదే విధంగా విద్యార్థికైనా ఇదేవిధంగా సహాయ సహకారాలు అందజేసి అండగా ఉండి ఐకమత్యాన్ని చాటుతం అన్నారు ఈ కార్యక్రమంలో బీసీ యువజన సంఘం జిల్లా అధ్యక్షులు ఆవిడపు ప్రణయ్ కుమార్ బొట్టుపల్లి సాయి కృష్ణ ,ఆకాష్, హరికృష్ణ , సమ్మన్న, సాయి ప్రణీత్ తదితరులున్నారు