జనం న్యూస్ 23 జనవరి విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్:- రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వికలాంగులు పెన్షన్లు తొలగించేందుకు కుట్ర పన్నుతున్నారని విజయనగరం జిల్లా పరిషత్ ఛైర్మన్ మజ్జి శ్రీనివాసరావు బుధవారం ఒక ప్రకటనలో అన్నారు. సామాజిక పెన్షన్లు తగ్గించేందుకు చర్యలు చేపట్టినట్లు ఆరోపించారు. వికలాంగుల పెన్షన్లు తొలగిస్తే పోరాటం చేస్తామన్నారు. అర్హులకు పెన్షన్లు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు