జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా.
మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడాలని ఎంపీడీవో రాధాకృష్ణ మండల సర్పంచుల సంఘం అధ్యక్షులు నాగిరెడ్డిపల్లి మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ జంబు సూర్యనారాయణ అన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం పురస్కరించుకొని గురువారం నాగిరెడ్డిపల్లెలో మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరు మొక్కలు నాటి మానవాళి మనుగడలో భాగస్వాములు కావాలన్నారు. ప్లాస్టిక్ వాడకం తగ్గించి పర్యావరణాన్ని కాపాడాలని ప్లాస్టిక్రహిత దేశంగా మనమందరం పాలు పంచుకోవాలని పిలుపునిచ్చారు. చిన్నతనం నుండి మొక్కలు నాటే అలవాటును పిల్లల్లో తీసుకురావాలని ఇందుకు తల్లిదండ్రులు ఉపాధ్యాయులు తమ వంతు కృషి చేయాలి అన్నారు. అనంతరం సచివాలయాన్ని తనిఖీ చేశారు సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉండి ప్రభుత్వం అమలు చేస్తున్న అన్ని సేవలు వారికి అందేలా చూడాలన్నారు.యోగ పై ప్రజల్లో అవగాహన కల్పించాలని సిబ్బందికి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నాగిరెడ్డిపల్లి మేజర్ గ్రామపంచాయతీ కార్యదర్శి సురేష్. సచివాలయం టు కార్యదర్శి రమణ సచివాలయం సిబ్బంది ఏఎన్ఎంలు ఎమ్మెల్ హెచ్ ఓలు