జనం న్యూస్ 23 జనవరి విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్:- జిల్లాలో రైతులు దగ్గర ఇంకా ధాన్యం మిగిలి ఉన్న నేపథ్యంలో అదనంగా కొనుగోలు చేసేందుకు చర్యలు తీసుకోవాలని లోక్‌సత్తా రాష్ట్ర అధ్యక్షుడు భీశెట్టి బాబ్జీ కోరారు. ఈ మేరకు బుధవారం జాయింట్ కలెక్టర్ సేతు మాధవన్‌ను కలెక్టరేట్లో కలిసి వినతి పత్రం అందజేశారు. ప్రభుత్వం నుంచి తొందరగానే నిధులు విడుదల అయినప్పటికీ కొందరు మిల్లర్ల వల్ల రైతులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు