బిచ్కుంద జూన్ 5 జనం న్యూస్
ఇందిరమ్మ రాజ్యంలో ఇంటింటా ఆనందం. ప్రజా ప్రభుత్వంలో పేదల సొంతింటి కల సాకారం
గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో జుక్కల్ నియోజకవర్గానికి ఒక్కటంటే ఒక్క డబుల్ బెడ్రూమ్ ఇళ్లు రాలేదు
ప్రజా ప్రభుత్వంలో అర్హులైన ప్రతీ ఒక్కరికీ ఇందిరమ్మ ఇండ్లు వస్తున్నాయి జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు గారి ప్రత్యేక శ్రద్ధతో నియోజకవర్గంలో పేదలకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు అయ్యి నిర్మాణాలు ప్రారంభం అయ్యాయి..అదేవిదంగా రాజుల్ల గ్రామం లో అజయ్ పటేల్ మాట్లాడుతూ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు సహకారం తో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం ప్రారంభించడం జరిగింది అని తెలిపారు.పేదల బతుకుల్లో వెలుగులు నింపుతున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి, ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు కి రాజుల్లా గ్రామ కాంగ్రెస్ నాయకులు, ప్రజలు కృతజ్ఞతలు తెలుపుతున్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తో పాటు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు సంజీవ్ పటేల్ జై కుమార్ సతీష్ పటేల్ కాంగ్రెస్ నాయకుడు గంగాధర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు