జనం న్యూస్. తర్లుపాడు మండలం. జనవరి 23:- తర్లుపాడు మండలం లింగారెడ్డి కాలనీ లో గల ప్రాధమిక పాఠశాలలో స్వాతంత్రసమర యోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి వేడుకలు ఘనముగా నిర్వహించారు దేశభక్తి, ధైర్యం,పోరాటం, స్వాతంత్రం సాధన కోసం చేసిన పోరాటం విదార్థులకు ప్రధానోపాధ్యాయులు . షేక్ మౌలాలి తెలియచేశారు.ప్రతిఒక్కరూ దేశభక్తిని కలిగివుండాలని,మహనీయులను స్ఫూర్తిగా తీసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు షేక్షావలి,విద్యార్థులు పాల్గొన్నారు.