జనంన్యూస్. 06.నిజామాబాదు. ప్రతినిధి.
24 కేసులలో నాన్ బెయిల్ వారెంట్ ఇష్యూ అయి తిరుగుతున్నటువంటి నేరస్థుని పట్టుకున్న నిజామాబాదు సి.సి.ఎస్ పోలీసులు: పోలీస్ కమిషనర్ వెల్లడి
కామారెడ్డి జిల్లాలో గత కొన్ని సంవత్సరాలుగా నేరాలకు పాల్పడుతూ పోలీసులకు చిక్కకుండా తిరుగుతున్నటువంటి బబ్లు బాలాజీ గైక్వాడ్ అలియాస్ ధన్ల బాబు తండ్రి పేరు బాలాజీ వయసు: 47 సంవత్సరాలు, కులము: వడ్డెర, వృత్తి : డ్రైవర్, స్వస్థలం :ఖానాపూర్, గ్రామము, దేగ్లూర్ తాలూకా, నాందేడ్ జిల్లాకు సంబంధించిన ఇతను నాన్ బెయిల్ వారెంట్స్ ఇష్యూ అయినా కానీ ఇప్పటికీ పోలీసులకు చిక్కకుండా నేరాలు చేస్తూ తిరుగుతున్నారు. ఇతని కోసం పోలీసులు గత కొన్ని సంవత్సరాలుగా ఎంత గాలించినా చిక్కడం లేదు. ఇతనిపై ఇప్పటి వరకు 24 వారెంట్లు ఇష్యూ కావడం జరిగింది.
నేడు ఈ నేరస్తుడు నిజామాబాద్ పరిసర ప్రాంతాలలో నేరాలు చేయడానికి తిరుగుతున్నట్లు నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య, ఐ.పీ.ఎస్., కి సమాచారం రాగా నేడు నిజామాబాద్ పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు నిజామాబాదు సి.సి.ఎస్ పోలీసులు చాకచక్యముగా పట్టుకొని కామారెడ్డి పోలీసు వారికి అప్పగించినైనది. ఇట్టి నేరస్తుని పట్టుకోవడంలో నిజామాబాద్ సిసిఎస్ ఏసిపి కె. నాగేంద్ర చారి , సిసిఎస్ సీ.ఐ సురేష్ మరియు సిసిఎస్ సిబ్బంది పాల్గొనడం జరిగింది. ఇట్టి నేరస్తుని చాకచక్యంగా పట్టుకున్నందుల గాను నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి సాయి చైతన్య, ఐ.పీ.ఎస్., సిసిఎస్ సిబ్బందిని అభినందించడం జరిగింది.