▪ జమ్మికుంట కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు.. సుంకరి రమేష్
జనం న్యూస్ //23//జమ్మికుంట //కుమార్ యాదవ్.. ప్రజా పాలన భాగంగా తెలంగాణ రాష్ట్రంలో గ్రామాల్లో గ్రామసభలు పట్టణాలలో వార్డు సభలు సంబంధించిన అధికారులు నిర్వహిoచారు.ఇ సందర్బంగా కాంగ్రెస్ పార్టీ జమ్మికుంట పట్టణ అధ్యక్షులు సుంకరి రమేష్ మాట్లాడుతూ…కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రంలో ప్రజా పాలన లో భాగంగా ప్రజల వద్ద నుంచి అభివృద్ధి కార్యక్రమాలకు లబ్ధిదారుల ఎంపిక కొరకు వారి నుంచి దరఖాస్తు స్వీకరించడం జరిగింది,అన్నారు.అందులో గృహమ్ లేని వాళ్ళు గృహం కోసం, రేషన్ కార్డు లేని వారు రేషన్ కార్డు కోసం,వివిధ పథకాల గురించి దరఖాస్తు స్వీకరించబడి ఉన్నవి, అని తెలిపారు. నిన్న గ్రామ సభల్లో వార్డు సభల్లో రేషన్ కార్డు లబ్ధిదారుల లిస్టు మరియు ఇందిరమ్మ ఇండ్ల లిస్టు ప్రకటించడం జరిగింది. అన్నారు.జమ్మికుంట పురపాలక సంఘం పరిధిలో 14వ వార్డులో గ్రామ సభ నిర్వహించడం జరిగింది, అన్నారు.ఈ కార్యక్రమంలో 14 వార్డు కౌన్సిలర్ భోగం సుగుణ కుమారుడు టిఆర్ఎస్ కార్యకర్త భోగం వెంకటేష్ అకారణంగా, అవివేకంగా సభ జరిగే సమయంలో బ్యానరును ఛీoపుతూ మురుగు మోరిలో వేసి తొక్కుతూ బూతు మాటలు మాట్లాడడం ఏంటి అని ప్రశ్నించారు.అది అతని అవివేకానికి నిదర్శనం అని, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు సుంకరి రమేష్ తీవ్రంగా ఖండించారు. గత పది సంవత్సరాలు టిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉండి ఒక డబుల్ బెడ్ రూమ్ గాని, ఒక నూతన రేషన్ కార్డు గాని దళితులకు మూడెకరాల భూమి అని ఇంటికో ఉద్యోగం అని ఎన్నో మాయమాటలు చెప్పి పది సంవత్సరాలు పబ్బం గడుపుకొని బ్రతికిన ఈ నీచ టీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ పార్టీని విమర్శించడం సరికాదు అని మండిపడ్డారు. కాంగ్రెస్ నాయకుల పై ఆరోపణలు చేయడం, సరైనది కాదు అని,నోరు జాగ్రత్తగా పెట్టుకొని మాట్లాడాలని హెచ్చరించారు.కాంగ్రెస్ పార్టీ ప్రజల పార్టీ ప్రజా అభివృద్ధికి తోడ్పడే పార్టీ అని తెలియజేస్తున్నాము అన్నారు.మా ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారెంటీలను కచ్చితంగా ప్రజలలో పెట్టి ప్రజలలో మెప్పు పొందే దిశగా ప్రయాణం చేస్తామని తెలియజేసారు.
ఒక గవర్నమెంట్ ప్రోగ్రామ్ను అడ్డుకున్నందుకు ఇతనిపై తక్షణమే చట్టపరమైన చర్య తీసుకోవాలని అధికారులను కోరడం జరిగింది అని తెలిపారు.