(జనం న్యూస్ చంటి జూన్ 7) ఈ రోజు దౌల్తాబాద్ లో బడిబాటలో భాగంగా ప్రభుత్వ బడి - అమ్మ ఒడి అని మండల విద్యాధికారి అన్నారు. ఇంటింటికి ప్రభుత్వ పాఠశాల యొక్క సౌకర్యాలను విద్యార్థులకు ప్రభుత్వం అందించే పాఠ్యపుస్తకాలు ఏకరూప దుస్తులు మధ్యాహ్న భోజనం ఇవన్నీ కూడా ప్రభుత్వం ఉచితంగా అందిస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ప్రభుత్వ పాఠశాలలోనే పిల్లలను అడ్మిషన్ తీసుకోవాలని తల్లిదండ్రులకు సూచించారు అదేవిధంగా శిక్షణ పొందినటువంటి ఉపాధ్యాయులు ప్రభుత్వ పాఠశాలల్లోనే ఉంటారు మంచి విద్యాబోధన అందిస్తారు కాబట్టి అందరు కూడా ప్రభుత్వ పాఠశాల వైపే మొగ్గు చూపాలని అనవసరంగా ప్రైవేట్ పాఠశాలల్లో విద్యార్థులను చేర్పించి తల్లిదండ్రులు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోకూడదని సూచించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు జ్యోతి ఉపాధ్యాయులు దేవి సింగ్ మంజుల సుధాకర్ తల్లిదండ్రులు మహేష్ తదితరులు పాల్గొన్నారు.