హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా జిల్లా చైర్మన్ డాక్టర్ వి డేవిడ్
జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా. అన్నమయ్య జిల్లా రాయచోటి కలెక్టర్ ఆఫీస్ నందు, ప్రవేట్ విద్యా సంస్థలు ప్రభుత్వ నియమ నిబంధనలకు విరుద్ధంగా నడుచు కుంటున్నారని ప్రభుత్వ నిబంధ నలకు లోబడి ప్రైవేటు విద్యా సంస్థలు నడుచుకోవాలని హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా కడప,అన్నమయ్య జిల్లాల చైర్మన్ డాక్టర్ డేవిడ్ కళ్యాణి రాజు, అన్నమయ్య జిల్లా, కలెక్టర్ కార్యాలయంలో డిఆర్ఓ కు వినతిని అందించడం జరిగినది.డిఆర్ఓ మాట్లాడుతూ ఈ విషయం పై అధికారుల దృష్టికి తీసుకెళ్తానని వెల్లడించడం జరిగినది.ఈ కార్యక్రమంలో, హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, పులివెందుల చైర్మన్ నేసే జాన్ పాల్, తదితరులు సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.