ప్రభుత్వపాఠశాల లో చదివే వారికీ ట్రిపుల్ ఐ టి లో సీట్, కార్పొరేట్ కాలేజీ లో రాయితీ లభిస్తుంది-ఇంచార్జి హెచ్ ఏమ్.
జనం న్యూస్ జూన్ 07:నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల మండలంలోని తడపాకల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లో శనివారం రోజునా రాష్ట్ర ప్రభుత్వం ఆచార్య జయశంకర్ ఆశయ సాధనార్థం పురస్కరించుకొని ఏర్పాటు చేసిన బడిబాట కార్యక్రమాన్ని పాఠశాల ఉపాధ్యాయబృందం రోజు వారి దినచర్య గా ఈనెల 6 నుండి 19 వరకు అనేక విధాలుగా షెడ్యూల్ విధానాలను అనుసరించి నిర్వహించడం జరుగుతుంది.దీని ఉద్దేశ్యం అంగన్వాడి పాఠశాలల నుండి ప్రైవేట్ పాఠశాలల నుండి ఇతర వర్గాల నుండి డ్రాప్ ఔట్ విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించి గుణాత్మక విద్యను అందించడ మే లక్ష్యంగా పాటుపడడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో ఇంచార్జ్ ప్రధానోపాధ్యాయులు గంగాధర్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో విద్యను అభ్యసించినట్లయితే విద్యార్థుల ఉన్నత విద్యలభించడమే కాక ట్రిపుల్ ఐటీ లో సీట్ రావడం, కార్పొరేట్ పాఠశాలలో రాయితీ దొరికే ఆస్కారం ఉందని అన్నారు. ఈ బడిబాట లో ఉపాద్యాయులు కృష్ణ ప్రసాద్, సుధాకర్ , రాములు, స్వప్న, రవి,ఆనంద్, నవీన్, దేవానంద గౌడ్ , ర్చిలుక భూపతి,చక్రపాణి, విజయపాల్గొనడం జరిగింది.